Header Banner

23 ఏళ్లలో పాకిస్థాన్ అత్యంత చెత్త రికార్డు! ఈసారి ఒక్క మ్యాచ్ కూడా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు!

  Fri Feb 28, 2025 07:49        Politics

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ లీగ్ దశలోనే టోర్నీ నుండి నిష్క్రమించింది. కివీస్‌తో 60 పరుగుల తేడాతో, భారత్‌తో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నిష్క్రమించింది. 1996 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఆతిథ్యమిచ్చిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్‌లేవీ గెలవకుండా అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది.

 

ఇది కూడా చదవండి: అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..  

 

గత 23 ఏళ్లలో ఐసీసీ టోర్నమెంటుకు ఆతిథ్యమిస్తూ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించని జట్టు పాకిస్థాన్ కావడం గమనార్హం. ఐసీసీ నాకౌట్ ఈవెంట్‌గా మొదలైన ఈ ట్రోఫీ తొలి టోర్నీ 1998లో బంగ్లాదేశ్‌లో ప్రారంభమైనప్పటికీ, వివిధ కారణాలతో ఆ దేశం పాల్గొనలేదు. 2000లో ఆతిథ్యమిచ్చిన కెన్యా ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీగా రూపాంతరం చెందింది. 2002లో భారత్, శ్రీలంక సంయుక్త విజేతగా నిలువగా, 2004లో ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్ రన్నరప్‌గా నిలిచింది. 2006లో ఆతిథ్యమిచ్చిన భారత్, 2009లో ఆతిథ్యమిచ్చిన దక్షిణాఫ్రికా తమ గ్రూపుల్లో మ్యాచ్‌లను నెగ్గాయి. కానీ పాకిస్థాన్ ఈసారి ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pakistan #CricketTeam #Pakistan #ICC